11 May, 2026 | 11:56 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

నరకం చూపించిన ‘నర్స’మ్మ!

07-05-2024 12:10 AM

అమెరికాను భూతల స్వర్గంగా భావిస్తుంటాం. నిజానికి ఆధునిక సౌకర్యాల విష యంలో అగ్రరాజ్యాన్ని తప్పు పట్టవలసిన పని లేదు. కానీ, ఎక్కడైతే స్వర్గం వుంటుందో మరో కోణంలో అక్కడ ‘నరకానికి’ అవకాశం వుంటుంది. ఈ కోణంలోనే నమ్మశ క్యం కాని నేరాల గురించిన వార్తలూ అక్కడ్నించి అడపాదడపా వింటుంటాం. వైద్యరం గంలోనూ అమెరికాలో అయితే ప్రపంచ అగ్రశ్రేణి చికిత్స లభిస్తుందనీ భావిస్తుంటాం. అసాధారణ పొరపాట్లు, అమానవీయ సం ఘటనలూ అక్కడే జరిగిన దుస్సంఘటనల గురించి మనం విన్నాం. వైద్యులు దేవుళ్లయితే, నర్సులను దైవ సహాయకులుగానూ అందరం నమ్ముతాం. 

కానీ, తాజాగా అమెరికా రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో వెలుగులోకి వచ్చిన ఒక ‘రాకాసి నర్సమ్మ’ ఉదంతంతో అంతగా అభివృద్ధి చెందిన అగ్ర దేశంలో ఇంతటి దారుణ సంఘటనలు జరుగుతాయా అని ఆశ్చర్యమేస్తుంది. వైద్య సహాయంతో ప్రాణాలు కాపాడవలసిన ఆ నర్సు ఏకంగా 17 మంది పేషెంట్ల ప్రాణాలు గాలిలో కలిసి పోవడానికి కారణమైంది. పోనీలే పాపం, నర్సు వృత్తిలో ‘తెలియక తప్పులు చేసిందేమో’ అనుకోవడానికి వీల్లేదు. బాధితుల ఆవేదన ప్రకారం ‘ఆమె వ్యక్తిత్వమే అంత రాక్షసప్రాయ’మైంది. మూడు ఉద్దేశపూర్వక హత్యలు, 19 హత్యానేరాల్లో తన ప్రమేయం వున్నట్టు వచ్చిన ఆరోపణలను తానే స్వయంగా ఆమె అంగీకరించింది. ఇంత జరిగాక కోర్టు ఊరుకో దుగా, ‘మూడు జీవిత కాలాల ఖైదుసహా మిగిలిన అన్ని కేసులలోనూ కలిపి ఏకంగా మొత్తం 760 సంవత్సరాల జైలు శిక్షను ఆమెకు విధించింది. 

ఆ నర్సు పేరు హీథర్ ప్రెస్డీ. వయసు నలభై ఒక్క సంవత్సరాలు. ప్రాణాలు కాపాడవలసిన నర్సు వృత్తిలో ఆమె ఇంతటి దారుణాలకు పాల్పడిందా? అంటే నమ్మ లేం. కానీ, కోర్టు శుక్రవారం విధించిన అసాధారణ జీవితకాల శిక్ష, దాని నేపథ్య నేర చరి త్ర తెలిస్తే నమ్మక తప్పదు. ఆమె హాస్పటల్స్ డ్యూటీలో ఉన్నవేళ పేషెంట్లకు ఊహించని విధంగా ఇన్సులిన్‌ను తీవ్ర మోతాదులో ఇచ్చేసిందట. ఇన్సులిన్‌ను అలా అధిక మో తాదులో ఇవ్వడం వల్ల ‘హైపోగ్లుసైమియా’కు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా గుండెపోటు పెరిగిపోయి మనుషుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలా, ఆమె దుశ్చర్య ఫలితంగా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆమెపై ఆరోపణ లు వచ్చాయి. కోర్టు ఈ మేరకు  విచారణ జరిపి 760 సంవత్సరాల జైలుశిక్షను ఖరా రు చేస్తూ తీర్పు వెల్లడించింది. ప్రెస్డీ మొత్తం 22 మంది రోగులకు అధిక మొత్తంలో (ఇవ్వకూడని విధంగా) ఇన్సులిన్ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

వీరిలో చాలామంది పేషెంట్లు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తర్వాతో మరణించారు. తొలుత ఇద్దరు రోగులను చంపినట్లుగా ఆమెపై అభియోగాలు రాగా, విచారణ జరపగా, మిగిలిన నేరాలన్నీ వెలుగులోకి వచ్చా యి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం గతేడాదే ఆమె నర్సింగ్ వృత్తి లైసెన్సును రద్దు చేశారు. నిజానికి ఆ నర్సుకు ఏ జబ్బూ లేదు. ‘మానసిక పరిస్థితి బాగా లేదా?’ అంటే ‘పిచ్చిదేమీ’ కాదు. కాకపోతే, ఆమె వ్యక్తిత్వమే ‘రాక్షసస్థాయి’ దుష్ట బుద్ధితో కూడుకున్నదిగా విచారణంలో తేలింది. ‘నేరాలకు పాల్పడే సమయంలో ఆమె ముఖంలోకి మనం చూడలేం. అంత క్రూరంగా వుంటాయి ఆమె ముఖ కవలిక లు’ అని బాధితులు వాపోయారు.