రష్యా యుద్ధం ఆగదా?
రష్యా- యుద్ధంలో ఇప్పటి వరకు 30 వేల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆస్తి నష్టానికి అంతే లేదు. మరోపక్క రష్యావైపు కూడా లక్షన్నర మందికి పైగా సైనికులు చనిపోయినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ యుద్ధంలో రష్యా ‘నిషేధిత క్లారో పిక్రిన్’ అనే విషవాయువును వాడుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఇదే గనుక నిజమైతే, ఉక్రెయిన్ సర్వనాశనం తప్పదు.
రష్యా యుద్ధం మొదలై రెండేళ్లు దాటింది. 2022 ఫిబ్రవరి 22, -23 తేదీల మధ్య ఉక్రెయిన్‌లోని కీవ్‌తోపాటు చుట్టుపక్కల నగరాలపై రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. రష్యా చేసిన ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు ఉక్రెయిన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. నాటో సభ్యదేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. అమెరికా, బ్రిటన్, పోలాండ్, ఫ్రాన్స్‌సహా పలు దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటూనే ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు అన్ని విధాలుగా సాయం అందిస్తుండగా, మరోవైపు చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ తదితర దేశాలు రష్యాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అండగా నిలుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 22 వరకు యుద్ధంలో 30,457 మంది చనిపోవడమో లేదా గాయపడటమో జరిగింది. మృతి చెందిన వారిలో 10,582 మంది సామాన్య పౌరు లు ఉన్నారు. వారిలో 582 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరిలో దాదాపు 5 వేల మంది పేలుడు ఆయుధాల కారణంగానే చనిపోయారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో లక్షా 50 వేల మందికి పైగా రష్యా సైనికులు మృతి చెందారని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి స్టిఫానే సిజౌర్న్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది మిలిటరీ వైఫల్యమేనని కూడా ఆయన అన్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న రష్యా యుద్ధానికి ఇప్పట్లో తెర పడే సూచనలు కన పడటం లేదు. ఇక, ఏ రాజీ మార్గాలు లేవు, చర్చ లు లేవు. పౌరుషాలు, పట్టింపులతోనే యుద్ధం భీకరంగా కొనసాగు తోంది. ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీలు లేకుండా ఉంది. ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం అందుతుండటం, అది రెచ్చిపోవడం జరుగుతోంది.
రష్యా విషవాయు ప్రయోగం
కాగా, మునుపెన్నడూ లేని దాడి రష్యా చేసింది. అందమైన హ్యారీ పాటర్ భవనా న్ని రష్యా ధ్వంసం చేయడం, దాని తాలూ కు అవశేషాలు మిగలడం పలువురిని బాధలకు గురి చేసింది. దానికితోడు రష్యా విషవాయువును ప్రయోగించడం చూస్తే ఉక్రెయిన్‌ను నామరూపాలు లేకుండా చేయాలనే తలంపుతో ఉన్నట్లు ఉంది. అందులో భాగంగానే ‘క్లారో పిక్రిన్’ విష వాయువును ప్రయోగించింది. అది అత్యంత ప్రమాదకరమైన వాయువు. కేవలం దాని తాలూకు పొగ పీల్చినా అనారోగ్యం బారిన పడతారు. రకరకాల రుగ్మత లు వ్యక్తులను పీడిస్తాయి. చివరికి మృత్యువాత పడతారు. ఇటువంటివి వాడకూడ దని ఒక ఒప్పందం ఉంది. ఈ వాయువు ను మొదటి ప్రపంచయుద్ధంలో మొదటిసారిగా జర్మనీ వినియోగించింది. అప్పుడే దీని ప్రభావం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ‘క్లారో పిక్రిన్’ వాడటం అనేది పౌరులను నష్ట పరచడానికే. వీటి ఉద్దేశం తెలిసే 193 దేశాలు దీన్ని ధ్వంసం చేశాయి. కొన్ని భద్రపరచినట్లు తెలుస్తోంది. యుద్ధంలో వైరి దేశ సైనికులను విశేషంగా నష్ట పరచడానికి, గాయ పరచడానికి దీన్ని వాడతారు. అందువల్ల ఈ ఆధునిక యుగంలో వీటిని ఏ దేశం కూడా ఉపయోగించకుండా ‘కెమికల్ వెపన్స్ కన్వెన్షన్’ అనే ఒక అంగీకా రానికి విశ్వదేశాలు వచ్చాయి. అయితే, రష్యా దీన్ని ఉల్లంఘించింది. ‘క్లోరో పిక్రిన్ ’వాడి ఎందరికో కడుపు కోత మిగిల్చింది. వీటితోపాటు విషపూరిత గ్రెనేడ్లుఉక్రెయిన్‌పై విచక్షణా రహితంగా వాడటం దేశాలను నివ్వెర పరచింది. ఈ వాయువును ముందుగా పసి గట్టింది అమెరికానే.
ఇక ఉక్రెయిన్‌కు ఎటువంటి ఆయుధాలు ఇస్తుందోనని ఆందోళన ఉంది. ఉక్రెయిన్ మాత్రం ప్రతీకారంతోనే ఉంది. పౌరుల ఆక్రందనలు, బాధలు పట్టనట్లు ఉంది. ‘క్లోరో పిక్రిన్’ కంటే అత్యంత విషపూరిత వాయువునే ఉక్రెయిన్, అమెరికాను కోరుతుందనే ఆలోచన ఉన్నట్లు ఉంది. అదే జరిగితే, ఇక రెండు దేశాలు దాడులు, ప్రతి దాడులతో పేట్రేగి పోవచ్చు. మొత్తానికి నష్ట పోయేది పౌరులే కదా. ఇప్పటికయినా ఉక్రెయిన్ కళ్ళు తెరవాలి. అగ్రదేశం అండ ఉందని మిడిసి పడకుండా రాజీ మార్గాలు అన్వేషించాలి. జెలెన్‌స్కీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఒక సముచిత నిర్ణ యం తీసుకోవాలి. ఇక, ఎంత చేసినా ఫలి తం నష్టమే కదా అని అది పునరాలోచించుకోవాలి. హ్యారీ పాటర్ భవనం మళ్ళీ నిర్మించాలి అంటే ఎంత కష్ట పడాలి! అది గత వైభవాన్ని పోగొట్టుకుంది. ఆ దేశం లో పౌరులందరూ జెలెన్ స్కీపై ఆగ్రహం తో ఉన్నారు. ‘మనం ఎక్కడ ఉన్నాం’ అనే భ్రాంతితో ఉన్నారు. అమెరికా, మరికొన్ని దేశాలు ఉక్రెయిన్‌కు సర్ది చెప్పాలి. విశ్వం ప్రగతి పథంలో పయనించాలి. అంతేకానీ, ఇలా యుద్ధ్ధాలు, విష వాయువులతో ఆటలాడుకోరాదు. రష్యాకూడా విష వాయు వులు ఉపయోగించి పౌరులను భయభ్రాంతులకు గురి చేయకుండా సంయమ నం పాటించాలి.
తాజాగా రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు సమీపంలో రష్య న్ మిలిటరీ, నేవీ ఆధ్వర్యంలో అణ్వాయుధాల డ్రిల్ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పుతిన్ అణుయుద్ధానికి సంబంధించి పలుసార్లు హెచ్చరికలు చేయడం తెలిసిందే. ‘న్యూక్లియర్ డ్రిల్స్’ చేస్తున్న సమయంలో ‘నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్’ ఆయుధాలను ఉపయోగించడంపై శిక్షణ తీసుకో నున్నట్లు తెలిపింది. ‘నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్’ ఆయుధాలను ‘టెక్నికల్ వెపన్స్’ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్ గుండా వీటిని ప్రయోగిస్తారు.
ఇరు దేశాలూ వెనక్కి తగ్గాలి
ఇక యుద్ధం ఆగాలి అంటే ఒకే ఒక ఫార్ములా ఉంది. ఇప్పటికే జరిగిన నష్టం జరిగి పోయింది. ఉక్రెయిన్‌ను దాని మానాన దాన్ని రష్యా వదిలివేయాలి. అది నాటోలో చేరినంత మాత్రాన రష్యాకు వచ్చిన నష్టం ఏమిటో తెలుసుకోవాలి. అమెరికా సహాయం చేయకుండా ఉంటే ఈ పాటికి యుద్ధం ఆగి ఉండేది. ఈ యుద్ధం పరోక్షంగా రష్యా, అమెరికా మధ్య జరుగుతున్నట్లుగా ఉంది. కనుక, రష్యా కూడ మానవతా దృక్పథంతో యుద్దాన్ని విరమించాలి. కొద్ది రోజులు దాడులు, ప్రతిదాడులు ఆగిపోతేనే మేలు. ‘రష్యా మౌనంగా ఉంది కదా’ అని ఉ్రక్రెయిన్, ‘ఉక్రెయిన్ తగ్గింది కదా’ అని రష్యా దాడులు చేయరాదు. అప్పుడే యుద్ధం ఆగిపోతుం ది. దేశాలలో కూడా మార్పు వస్తుంది. లేకపోతే, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయేటట్లు కనుచూపు మేరలో కనపడటం లేదు. ఈ ఆధునిక యుగ చరిత్రలో రికార్డు సృష్టించేలా దీర్ఘ్ఘకాలంపాటు ఇది కొనసాగకుం డా చూడవలసి ఉంది.
కనుమ ఎల్లారెడ్డి
వ్యాసకర్త సెల్: 93915 23027






