పదోన్నతితో పాటు బాధ్యతలూ పెరుగుతాయి..
01-06-2026 01:27 AM
వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్, మే 31 (విజయక్రాంతి): పోలీ స్ అధికారులకు పదోన్నతి తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పో లీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ సిరా జ్ పాషా, ఏ.ఎస్.ఐ గా పదోన్నతి పొందిన రాజేంద్ర ప్రసాద్ ఆదివారం వరంగల్ పో లీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పదోన్నతి పొందిన అధికా రుల భుజాలపై పోలీసు కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి స్టార్ అలంకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెష ల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.






