24 March, 2026 | 10:37 AM

ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ

24-03-2026 01:02 AM
  1. ఓ ప్రయాణికుడిపై పది మంది మూకుమ్మడి దాడి
  2. అడ్డుకోబోయిన మహిళలపై పిడిగుద్దులు 

ఆర్మూర్, మార్చి 23 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులో సీటు కోసం మొదలైన గొడ వ చిలికి చిలికి గాలివానై ఘర్షణకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఈ ఘటన జరిగింది. సోమవారం నిర్మల్ నుంచి నిజామాబాద్ వెళ్లే బస్సులో ఓ వ్యక్తి సీటుకోసం ఖర్చీఫ్ వేశాడు. ఆ సీట్లో మరో వ్యక్తి కూర్చోవడంతో ఇద్దరి మధ్య మాటమా ట పెరగడంతో తోటి ప్రయాణికులు సర్దిచెప్పడంతో ఇద్దరు కలిసి అదే సీట్లో కూర్చు న్నారు.

ఇదంతా గమనించిన ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.. ఖర్చీఫ్ వేసిన మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎలా సీ టు ఇస్తావంటూ తన సామాజికవర్గానికి చెం దిన ప్రయాణికుడిని రెచ్చగొట్టాడు. అంతేకాకుండా ఆర్మూర్‌లో ఉన్న తన సామాజికవర్గ యువకులు సమాచారం అందించాడు. బ స్సు పెర్కిట్ ఆర్టీసీ బస్టాండ్ ఏరియాకి రాగా నే 10 మంది యువకులు ఒక్కసారిగా బస్సు ఎక్కి ఖర్చీఫ్ వేసిన ప్రయాణికుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.

బస్సులో ఉన్న మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపైనా పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడి లో ఖర్చీఫ్ వేసిన ప్రయాణికుడికి గాయాలు అయ్యాయి. బస్టాండులో ఉన్న ప్రయాణికులు కలగజేసుకోవడంతో యువకులు వెళ్లి పోయారు. కాగా, సీటు కోసం రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడం పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు ప్రయాణికులు కాంప్రమైజ్జ్ అయ్యి కూర్చున్నా.. మూడోవ్యక్తి రెచ్చగొట్టి గొడవ పెట్టడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.