13 July, 2026 | 12:26 PM

జత కోసం పులుల సంచారం.. ఇదే సమయం కీలకం!

13-07-2026 11:40 AM

అడవుల్లోకి వెళితే ప్రమాదం.

బోథ్, జులై 13(విజయక్రాంతి): పోరుగునే ఉన్న మహారాష్ట్ర అడవులలో నుండి తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) ఉన్న ప్రైవేటు రవాణా అడవుల్లోకి తరచుగా పులులు వస్తూ పోతున్నాయి గత నాలుగు సంవత్సరాల కాలంగా బోథ్ అడవుల్లో(Both forests) కావలసిన అంత ఆహారం పులులకు ఉండడంతో తరచుగా ఇక్కడే ముఖం వేస్తూ వస్తూపోతున్నాయి అయితే పులులు తోడు కోసం సంచరిస్తుండడంతో అడవుల్లోకి ప్రజలు వెళ్లవద్దని అటవీ శాఖ వర్గాల వారు అంటున్నారు.. 

ఈ మూడు నెలలు కీలకం

అడవి జంతువులు తమ సంతాన ఉత్పత్తికి ఆడ మగ పులులు వన్యమృగాలు తోడు కోసం సంచరిస్తుంటాయి. ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు నెలలో అటవీ జంతువులు కలుస్తుంటాయి అయితే ప్రశాంత వాతావరణంలో కలుసుకునే వన్యమృగాలకు అటంకంగా కనిపిస్తే మనుషులపై దాడులు చేసే ఆస్కారం ఉంది. ఈ సమయంలో ప్రజలు ఇవ్వరు అడవులలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.

పులులు చిరుతపులులు ఏ లు గు బండ్లు ఉన్న  అడవుల్లో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జంతువులకు అనుకూలమైన వాతావరణం ఉంది. బజార్హత్నూర్ మండలంలోని డేడ్రా అడవుల నుండి మహారాష్ట్రలోని కిన్వాట్  అడవుల మీదుగా అడవుల్లోకి వస్తు పోతున్నాయి. గత మూడు నెలల క్రితం డేడ్రా అడవుల్లో పులి నీలుగాయని వేటాడి చంపడం జరిగింది. అనంతరం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని వజ్జర్ అడవులలో నీ లోయలో నీటి వసతి సమృద్ధిగా ఉండడంతో అటవీ జంతువులన్నీ అక్కడే మకాం వేస్తున్నాయి. దీంతో అటవీ జంతువుల కు అవసరమైన ఆహారం అక్కడే లభిస్తుండడంతో వేసవి కాలం మొత్తం ఆ ప్రాంతంలోని సంచరిస్తుంటాయి.

జంతువుల రక్షణ పై అటవీశాఖ దృష్టి

అటవీ జంతువుల పరిరక్షణ పైన అటవీ శాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు. అడవులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అటవీ జంతువుల పై నిగా పెట్టారు. మరోవైపు వేటగాళ్లు సైతం అడవుల్లో సంచరిస్తున్నారు. సీసీ కెమెరాల లో వేటగాళ్లు తిరుగుతున్నట్లు కనిపిస్తే అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఏది ఏమైనా ఈ మూడు నెలల కాలం కీలకమని అటవీ అధికారులు అంటున్నారు.