ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశ గాని నర్సయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు, పేద ప్రజలందరికీ రిజర్వేషన్ రూపొందించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని బిజెపి పార్టీ సూర్యాపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశగాని నర్సయ్య అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం లక్ష్మాపురం గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పన, అంటరానితనం నిర్మూలన, దళితుల హక్కుల కోసం పోరాటం, మహిళా సాధికారత, విద్యాభివృద్ధి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు, కార్మిక చట్టం లాంటి అనేక సంస్కరణలు భారతదేశంలో చేశారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శాగంటి సత్తయ్య బూత్ అధ్యక్షులు & వార్డు సభ్యులు శాగంటి వీరభద్రయ్య వార్డు సభ్యులు సుంకరి భద్రమ్మ సుంకరి లింగయ్య గ్రామ పెద్దలు గెండల రాములు పందిరి వీరసోములు,శాగంటి మల్లయ్య దేశగాని నాగయ్య శాగంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






