డా.బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
14-04-2026 08:22 PM
ముకరంపుర,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, మహానేత, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అంబేద్కర్ సమాజానికి అందించిన స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.






