28 June, 2026 | 2:57 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

12-04-2025 10:46 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జియం కార్యాలయంలో శనివారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో సింగరేణి ఇల్లందు ఏరియాలో డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం వీసం కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఇల్లందు ఏరియాలో ఏప్రిల్-14న డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జెకె కాలనీ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 09.30ని.ల నుండి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులకు, విద్యార్ధిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నామన్నారు.

కావున ఉద్యోగులందరూ పాల్గొనాలని అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో నిర్ణయిoచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ ఆర్.వి నరసింహారాజు, డిజిఎం పర్సనల్ జీవి. మోహనరావు, డీ జీఎం వర్క్ షాప్ నాగరాజు నాయక్, డి వై ఎస్.ఇ(సివిల్) వెంకటేశం, ఎస్సీ లైజనింగ్ అధికారి కే.శ్రీనివాసరావు, ఎస్టి లైజనింగ్ అధికారి ఉండం బ్రహ్మం, ఎస్సీ-ఎస్టీ అసోసియేషన్ కమిటి సభ్యులు వి కిషన్, బి.రామారావు, బి.శ్రీనివాస్, ఎల్. ఈర్య, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, శంకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.