28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ

28-06-2026 02:25 PM

న్యూఢిల్లీ: 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక జాతీయ సమస్యలు, స్ఫూర్తిదాయక కథలు, పౌర నేతృత్వంలోని కార్యక్రమాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు ప్రజలు సహకరించాలని, అంతేకాకుండా నగరాల్లో కాలుష్యం తగ్గేందుకు అనేక చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజారవాణా ఎక్కువగా ఉపయోగించాలని, ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగం తగ్గించాలన్నారు.

పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి అని, మూఢనమ్మకాలు వదిలి శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని ప్రధాని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలని, అసోంలో హర్గీలా పక్షులను అశుభసూచకంగా భావిస్తున్నారు.. ఇది సరికాదు అని వెల్లడించారు. నాగాలాండ్ లోని చిన్నారుల ఫుట్‌బాల్ లీగ్ ను ప్రధాని మోదీ ప్రస్తావించారు.

5 నుంచి 12 ఏళ్ల పిల్లలు ఈ ఫుట్‌బాల్ లీగ్ లో ఆడుతున్నారని, నాగాలాండ్ చిన్నారులు దేశంలోని మిగతా ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన వ్యాఖ్యానించారు. యువత.. క్రీడలను కెరీర్ గా ఎంచుకొని కష్టపడాలని, యువత క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ కోరారు. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నామని, నా పిలుపు తర్వాత ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉంది. స్వదేశీ తయారీ మంత్రమే మన దేశానికి కీలకమని ప్రధాని మోదీ సూచించారు.