పకడ్బందీగా ఓటర్ జాబితా
28-06-2026 01:27 PM
బిఎల్ఓ ఎన్యుమరెషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను పరిశీలించిన ఆర్టీవో
ఎల్లారెడ్డి(విజయక్రాంతి): పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించడం కోసమే కేంద్రీయ ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిందని ఎల్లారెడ్డి ఆర్టీవో ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని పోలింగ్ నెంబర్ 252లో బిఎల్ఓ ఎన్యుమరెషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎస్ ఐ ఆర్ సర్వే కోసం వచ్చే బిఎల్ఓ లకు సహకరించి పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీ కోసం సహకరించాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకమైన ఓటరు జాబితా అవసరమని అన్నారు. ఈ ప్రక్రియ జులై 24 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు.






