28 June, 2026 | 3:25 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు

28-06-2026 02:48 PM

వాషింగ్టన్: ఇరాన్ లోని కీలక స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు నిర్వహించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఆదేశాల మేరకు ఇరాన్‌లోని 10 లక్ష్యాలపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్(US Central Command) ప్రకటించింది. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించి వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేపట్టింది.

ఇరాన్ దాడులకు ప్రతీకార చర్యలకు దిగిన అమెరికా, హర్మూజ్ జలసంధిలో 'కికు' చమురు ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ నిఘా, వాయు, రక్షణ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ భూభాగంపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా కువైట్ మరియు బహ్రెయిన్‌లపై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదివారం ప్రకటించాయి. అలాగే, ఇకపై ఎటువంటి దురాక్రమణ చర్యకైనా తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించాయి.