11 May, 2026 | 4:01 AM

అంబేడ్కర్ అభయహస్తం ప్రారంభించాలి

22-06-2024 03:30 AM
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, జూన్21 (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అంబేడ్కర్ అభయహస్తం వెంటనే ప్రారంభించాలని, బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించి మాట నిలబెట్టు కోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ మేధావి, భారతరత్న అం బేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆదృష్టమన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందు కు చిత్తశుద్ధితో దళితబంధును మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారన్నారు.  అంబేద్కర్ కలలుగన్న విధంగా దళితులు ధనికులు కావా లని, కులరహిత సమాజం రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సిరిసిల్ల లో బీఆర్‌ఎస్ ఆధర్యంలో నూతనంగా ఎన్నికైన అర్బన్ బ్యాంక్ పాలకవర్గాన్ని కేటీఆర్ సత్కరించారు. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ర్ట ప్రభుతంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం కూడా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యా, జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ రామారావు, రాష్ర్ట నాయకులు గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.