ఉద్యమ స్ఫూర్తిప్రదాత జయశంకర్
- మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిప్రదాతగా రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశతంగా నిలిచిపోయారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామన్న మాట్లాడుతూ.. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అలాల్ అజయ్, జగదీష్‌యాదవ్, విజ్జగిరి నారాయణ, కౌన్సిలర్లు వెనుగంటి ప్రకాష్, బండారి సతీష్, పండ్ల శ్రీనివాస్, ధర్మపాల్, రాంకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో
నిర్మల్, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అలాగే పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పింరు.






