29 June, 2026 | 2:03 AM

అంబేద్కర్ విగ్రహం సమానత్వానికి ప్రతీక

29-06-2026 12:00 AM

మంత్రి దామోదర్ రాజనర్సింహ

శివ్వంపేట జూన్ 28 : మండల కేంద్రంలోని పిల్లుట్ల గ్రామంలో బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి  ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..భారత రాజ్యాం గ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం ఆనందంగా ఉందన్నారు.

చదువుతో ప్రపంచాన్ని గెలిచారన్నారు. వారు మనకు చెప్పిన గొప్ప సం దేశం ఒక్కటే... పుట్టుక మన చేతిలో ఉండ దు... కానీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవా లో మన చేతిలోనే ఉంటుందన్నారు. బాబాసాహెబ్ చెప్పిన మార్గంలో సామాజిక న్యా యం, సమాన అవకాశాలు, మానవ గౌర వం కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం. మన యువతబాబాసాహెబ్ జీ వితాన్ని చదవాలని  పిలుపునిచ్చారు. రా జ్యాంగాన్ని తెలుసుకోవాలి.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర మురళీ గౌడ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ  ఇంచార్జి ఆ వులరాజిరెడ్డి, మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.