29 June, 2026 | 2:01 AM

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి: ఎమ్మెల్యే సునీత

29-06-2026 12:00 AM

వెల్దుర్తి, జూన్ 28 : పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా వెల్దుర్తి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో మెదక్ డిఎంహెచ్‌ఓ తో కలిసి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశా రు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఆరో గ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.