15 April, 2026 | 3:10 AM

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

15-04-2026 12:42 AM

సమానత్వం కోసం ఉద్యమించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 14: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్, డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు అయనపూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూచదువుతూనే అభివృద్ధి సాధ్యం అనిఅంబేద్కర్ సమన్యాయం, సమానత్వం కోసం ఉద్యమించిన మహోన్నత వ్యక్తి అని గుర్తు చేశారు.

ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యపడింది అనిఅంబేద్కర్ అందరికోసం రాజ్యాంగాన్ని రచించాడు అని తెలిపారు. తదుపరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలానేత మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గంలోని సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వీరయ్య, మహా త్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్టర్ అంజిరెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.