ప్రాణదాత 108
అటవీ ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు
ఒక్క కాల్‌తో ప్రాణ రక్షణ
గోల్డెన్ అవర్‌లో ఆశాకిరణం
ములుగు, మార్చి 29 (విజయక్రాంతి): ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కంటికి రెప్పలా కాపాడుతూ, సమయానికి ఆస్పత్రికి చేర్చి పునర్జన్మ ప్రసాదిస్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు ములుగు జిల్లాలో ప్ర శంసలు అందుకుంటున్నారు. గిరిజన ప్రాం తమైన ఈ జిల్లాలో 108 అంబులెన్స్ లు ప్రజలకు ప్రాణదాతలుగా మారాయి. దట్టమైన అడవులు, దూర గ్రామాలతో కూడిన ములుగు జిల్లాలో అత్యవసర వైద్య సేవలు అందించడం కష్టసాధ్యమైనప్పటికీ, 108 అంబులెన్స్ సిబ్బంది వేగంగా స్పందిస్తూ గిరిజన ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
వంద ఫోన్లు చేసినా రాని బంధువుల కంటే ఒక్క ఫోన్ కాల్తో స్పందించే 108 సిబ్బందే నిజమైన ఆపద్బాంధవులని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఓ గిరిజన గూడెంలో అర్ధరాత్రి సమయంలో గర్భిణీ స్త్రీ పురిటినొప్పులతో బాధపడుతుండగా, కుటుంబ స భ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికం కావడం తో సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణీ స్త్రీ కి ప్రసవం నిర్వహించి తల్లిబిడ్డలను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో ఇ లాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
ఏడాది కాలంలో ఎన్నో సేవలు
2025 మార్చి నుండి 2026 ఫిబ్రవరి వరకు ములుగు జిల్లాలో 108 సేవలు మొ త్తం 18,886 అత్యవసర కాల్స్కు స్పందించా యి. రోడ్డు ప్రమాదాలు 1,569, గర్భిణీ కేసు లు 2,461, సృహ కోల్పోయిన వారు 827, కడుపు నొప్పి 2,437, శ్వాసకోశ సమస్యలు 1,251, గుండెపోటు కేసులు 932, పాయిజన్ కేసులు 863, మూర్ఛ (ఫిట్స్) 647, ఆత్మహత్య ప్రయత్నాలు 368, ఇతర కేసులు 5,816 నమోదయ్యాయి.
గోల్డెన్ అవర్లో ప్రాణరక్షణ
ప్రాణాపాయ పరిస్థితుల్లో మొదటి గంట అత్యంత కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో 108 ఎమర్జెన్సీ మె డికల్ టెక్నీషియన్స్ (ఈఎంటి) తక్షణ చికిత్స అందిస్తుండగా, అంబులెన్స్ పైలట్లు వేగంగా రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. పం డుగలు, సెలవులు లేకుండా నిరంతరం సేవలందిస్తున్న 108 సిబ్బంది నిజంగా మృత్యు వుతో పోరాడే సైనికులని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించడం వారి ప్రత్యేకత.
మానవత్వానికి నిదర్శనం గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్లోనే ప్రసవాలు నిర్వహించడం, ప్రమాద బాధితులను ఆదుకోవడం, రోగులకు ధైర్యం చెప్పడం వంటి సేవలతో 108 సిబ్బంది మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ములుగు జిల్లాలో 108 అంబులెన్స్ సేవలు కేవలం వైద్య సేవ లే కాకుండా ప్రజల ప్రాణాలకు భరోసాగా మారాయి. ఒక్క ఫోన్ కాల్తో పునర్జన్మ ప్రసాదిస్తున్న ఈ ప్రాణదాతలు సమాజానికి నిజమైన హీరోలుగా నిలుస్తున్నారు.




