సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్
కార్డియాలజీ, న్యూరో, గ్యాస్ట్రో తదితర విభాగాల్లో సేవలు
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ డా.బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఐఏఎస్, డైరక్టర్(పా) గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు, సిఎంఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ సూచనల మేరకు,సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులు,కుటుంబ సభ్యుల సంక్షేమంలో ఆదివారం మెడికోవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైద్రాబాద్ వారిచే కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ నందు సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ మెడికల్ క్యాంప్ నందు కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు సేవలు అందించారు.
ఈ సందర్భంగా సిఎంఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... సింగరేణి సంస్థ కార్మికుల, ఉద్యోగుల సంక్షేమం విషయములో ముందు వరుసలో ఉంటుందని, సింగరేణి లో పనిచేసే వారికి, వారి కుటుంబ సభ్యులకు, సూపర్ స్పెషాలిటీ వైధ్యం అందించాలనే ఉద్దేశం తో, హైద్రాబాద్ కు వెళ్ళే అవసరం లేకుండా వారి సౌలభ్యం కొరకు,హైద్రాబాద్ లో గల అన్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వారిచే మన సింగరేణి ఆసుపత్రులలోనే వైద్యం అందిస్తున్నామని, ప్రతీ రెండవ ఆదివారం నాడు సింగరేణి ప్రధాన ఆసుపత్రి లో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులను నిర్వహించుకుంటున్నామని, కావున ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులు, కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సింగరేణియులు,పెద్ద సంఖ్యలో ఈ క్యాంప్‌లో పాల్గొన్నారు. మొత్తం 66 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
కార్డియాలజీ : 32 మంది
న్యూరాలజీ:26
గ్యాస్ట్రో ఎంట్రాలజీ :08
మొత్తం - 66 మంది
సంపూర్ణంగా వైద్య పరీక్షలు వైద్యుల సమక్షంలో జరిగాయి. అడిషనల్ సీఎంవో ఉష పర్యవేక్షణలో, నిర్వహించిన ఈ సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు లో, హెల్త్ ఆఫీసర్ డి.లలిత, మెయిన్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు.






