30 March, 2026 | 2:45 AM

నిర్మల్‌కు ఏమైంది..?

30-03-2026 01:06 AM

నిర్మల్ జిల్లా పేరు వినగానే నిర్మలత్వం గుర్తుకొస్తుంది. అటువంటి నిర్మల్ జిల్లాలో గత 15 రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు అటు పోలీస్ శాఖకు.. ఇటు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. శాంతి భద్రతల పర్యవేక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ చెప్తున్నా నిర్మల్‌లో కథ 15 రోజుల నుం చి ఏదో ఒక ఘటన జరిగి శాంతి భద్రతల అంశంపై ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

జిల్లా కేంద్రం మొదలుకొని వివిధ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. పోలీస్ శాఖ సంఘటన జరిగిన వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు శాంతి భద్రతల విషయంలో ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 

పోలీసులకు సవాల్‌గా మారిన వరుస ఘటనలు..

జిల్లా ప్రజల్లో ఉలిక్కిపాటు 

శాంతి భద్రతలపై ప్రశ్నిస్తున్న జనం 

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు 

తాజాగా గంజాయి కలకలం 

నిర్మల్, మార్చి 29 (విజయక్రాంతి): జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్, పోలీస్ అక్క, నారిశక్తి, శివం గి దళం తదితర ప్రత్యేకతలతో శాంతి పద్ధతులను కాపాడుతున్నామని చెప్తున్న పోలీస్ శాఖ ఇటీవల జరిగిన ఘటనలలో శాంతి భద్రతల నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ఒక ఎస్పీ ముగ్గురు అదనపు ఎస్పీలు తగిన పోలీసు బలగాలు, ఇంట లిజెంట్ వ్యవస్థ, తదితర కీలక పోలీస్ శాఖలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల విషయంలో ముందే పసిగట్టకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్న అభిప్రాయా లు వినవస్తున్నాయి. 

నిర్మల్ జిల్లాలో గత 15 రోజుల నుంచి వరుస ఘటనలు చోటిచుకోవడం అటు పోలీసులను ప్రజలను ఆం దోళన గురిచేస్తుంది. వారం రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థి సం ఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

రెండు రోజులపాటు చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని విద్యార్థి అధికారులే బాధ్యత వహించాలని విద్యార్థులు రెండు రోజులు బాసర త్రిపుల్ ఐటీ పరిపాలన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో చర్చకు దారితీయగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల అక్కడికి చేరుకొని వివాదం సద్దుమణిగాల చేసిన ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేపాయి. రెండు రోజులకి విద్యార్థి తల్లిదండ్రులు త్రిఫుల్ ఐటీ ముందు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. 

ఈ ఘటన మర్చిపోకముందే నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇరువర్గాల మధ్య వివాదం చిల్లరేగింది. ఈ పోలీసులు చాకచక్యంగా వివరించి వివాదాన్ని బయటకు రాకుండా సద్దుమణించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ పిల్లల వైద్య నిపుణులపై ఓ వర్గం వారు ముక్కుమ్మడిగా దాడి చేశారు. దీంతో వైద్యులందరూ రాత్రికి రాత్రి రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిరసన తెలిపారు. వైద్యులు ఆందోళన చేస్తున్న విషయా న్ని ముందే పోలీసులు పసుగట్టడంలో విఫ లం కావడంతో ఆందోళన తీవ్రత దాచి నిర్మల్ బందుకు కారణమైంది. 

వైద్యులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి ఒక దశలో వైద్యం మానేసుకుంటామన్న హెచ్చరిక చేపట్టారు. దీనిపై కలెక్టర్ ఎస్పీ స్పందించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే డాక్టర్లపై దాడులు ఇవేమీ కొత్త కావు. ఇప్పటివరకు 10 హాస్పిటల్‌పై ఇటువంటి ఘటనలు జరి గాయి. ఆస్పత్రులపై దాడులు చేసి న వారిపట్ల ప్రభుత్వం కఠిన చట్టాలను అమ లు చేయాల్సి ఉన్న కొన్ని సందర్భాల్లో తప్పించుకుంటున్నారు. డాక్టర్లకు మద్దతుగా బిజెపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా స్థానిక బస్టాండ్‌లో బంద్ సందర్భంగా వివాదం చెలరేగింది.

అంతకుముందు పట్టణంలో శాంతిన గర్ కోటలో నలుగురు వ్యక్తులు ఒకరిని బలవంతంగా లాక్కెళ్ళి హత్య చేసిన ఘటన జిల్లా లో చర్చనీయాంశంగా తయారైంది. ఈ ఘట న కూడా రెండు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. తాజాగా పట్టణంలోని సోఫినర్ కాలం చెందిన ఇద్దరు మైనార్టీ యువకులు అదే కా లం చెందిన మైనర్ బాలికలపై మాయమాటలతో అత్యాచారం యత్నం ఘటన శనివారం రాత్రి పట్టణంలో మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది.

అయితే పోలీసులు నిందితులను అదుపులో తీసుకొని అరెస్టు చేసి అత్యాచారానికి గురైన బాలికలను సఖి సెంటర్‌కు బందోబస్తు మధ్య తరలించారు. మంద పోలీస్ స్టేషన్లో ఎదురు నిర్వహిస్తున్న ఎస్సై రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కూడా జరిగింది. బాసర గోదావరి వద్ద ఆత్మహత్యల నివారణకు స్వయంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు స్పెషల్ పోలీస్ సిబ్బంది ఏర్పాటుచేసిన అక్కడ పది రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. 

పెరిగిన ప్రమాదాలు..

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 15 రోజుల నుంచి రోడ్డుపై ప్రమాదాలు కూడా పెరగడం ప్రమాదంలో మృతి చెందడం గాయ పడ్డ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పోలీస్ శాఖ ప్రతినిత్యం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం, వాహనాల తని ఖీ రోడ్డు భద్రత నియమాలు అవగాహన కల్పిస్తున్న జిల్లాలు మాత్రం రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మంజులపూర్ వద్ద రెండు, మధిలాపూర్ వద్ద ఇద్దరు, కడెం ఉడుంపూర్ వద్ద ఇద్దరు, లక్ష్మణ చందాల ఒకరు, లోకేశ్వరంలో ఇద్దరు, ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పలువురు గాయాలతో కూడా బయట పడుతున్నారు. ఈ నేపథ్యం లో నిర్మల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలు నిర్మల్ జిల్లాకు ఏం జరిగిందన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఇప్పటికైనా పోలీసులు శాంతిభద్ర విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.