15 July, 2026 | 4:53 AM

తుర్కియేలో భారీ పేలుడు

25-12-2024 02:26 AM
  • 12 మంది దుర్మరణం

నలుగురికి గాయాలు

అంకారా, డిసెంబర్ 24: తుర్కియే దేశంలోని ఆయుధ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సం భవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణా లు కోల్పోయారు. నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. బల్కిసెర్ ప్రావిన్స్‌లోని కవక్లి అనే పట్టణ శివారులో ఉన్న జేఎస్‌ఆర్ ఆయుధ కర్మాగారంలో మందుగుండు, ప్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.

మంగళవారం ఉదయం కంపెనీలో జరిగిన పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కంపెనీ మెయిన్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల భవనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం తరువాత ప్లాంట్ చుట్టు గాజు, మెటల్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే ప్రమాదం జరిగినపుడు కంపెనీలో ఎంతమంది ఉన్నా రో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ అం తర్గత మంత్రి వెల్లడించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నా మన్నారు. కాగా ప్రమాదంపై తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు స్థానిక గవర్నర్ సంతాపం తెలిపారు.