రాజకీయ రగడ మధ్య.. ఖాకీకి కఠిన పరీక్ష!
- గాడిదలపై పోస్టర్ల కేసు నుంచి ఫ్లెక్సీల వివాదాల వరకు.. పోలీసులకు సవాళ్లు..
- పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనం..
- ఒత్తిళ్లు, ఆరోపణల మధ్య శాంతిభద్రతలే లక్ష్యంగా విధులు
ఉప్పల్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : అధికార పక్షం.. ప్రతిపక్షం.. రాజకీయంగా ఎవరి వాదనలు వారివే. కానీ ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తిన ప్రతిసారీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం పోలీసుల(Police)పైనే పడుతోంది. ఉప్పల్ నియోజకవర్గం(Uppal Constituency)లోని ఉన్న పోలీస్స్టేషన్ల పరిధిలో రాజకీయ కార్యక్రమాలు(Political program), పోస్టర్లు(Posters), ప్లెక్సీలు(Flex banners), బ్యానర్ల వివాదాల(Banner disputes)తో పాటు పోటాపోటీగా దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం వంటి కార్యక్రమాలు కూడా పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఒకవైపు కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత.. మరోవైపు రాజకీయ నాయకుల(Political leaders) నుంచి వచ్చే ప్రశ్నలు(Questions), ఆరోపణలు(allegations).. వీటి మధ్య పోలీసులు చట్టపరంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది.
గాడిదలపై పోస్టర్లు.. రాజకీయ దుమారం..
ఇటీవల ప్రతిపక్ష పార్టీ పిలుపుమేరకు ప్రభుత్వ పథకాలకు(Government schemes) సంబంధించిన పోస్టర్లను గాడిదలకు అంటించారన్న ఆరోపణల నేపథ్యంలో ఉప్పల్ పోలీసులు(Uppal Police) ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశా రు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైనట్లు సమా చారం. ఈ ఘటన రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులను ప్రశ్నించడంతో పాటు, రాజ కీయ ఒత్తిళ్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. దీంతో కేసు నమోదు నుంచి పోలీస్స్టేషన్లో చోటుచేసుకున్న పరిణా మాల వరకు ఈ వ్య వహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్లెక్సీల వివాదాలూ సవాలే..
నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్లెక్సీలు, బ్యానర్ల విషయంలో గతంలోనూ పలుమార్లు వివాదాలు తలెత్తినట్లు స్థానికంగా చర్చ ఉంది. ఒక పార్టీ ప్లెక్సీ ఏర్పాటు చేస్తే మ రో పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం, అనుమతుల అంశం తెరపైకి రావడం, చివరకు వ్యవహారం పోలీస్స్టేషన్కు చేరడం పరి పాటిగా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియా(Social Media) లోని పోస్ట్లు సైతం వివాదాలకు దారి తీస్తూ నిత్యం పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మా రింది. పలుగురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్లెక్సీకి అ నుమతి ఉందా? నిబంధనలు ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే జిహెచ్‌ఎంసి అధికారుల చర్యలు ఉండేవి కానీ ఇప్పుడు ఉల్లంఘించారా? లేదా ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసిన జి హెచ్‌ఎంసి అధికారు లు చూసి చూసినట్లు వదిలేస్తున్నానని ఆరోపణ సైతం వెల్లు వెత్తుతున్నాయి అ యితే ఈ ఫ్లెక్స్ ల వల్ల ప్రజలకు, ట్రాఫిక్కు ఇ బ్బంది కలుగుతోం దా? అనే అంశాలను పరిశీలించి పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ వర్గంపై చర్య తీసుకున్నా మరో వర్గం నుంచి పోలీసులపై ఆరోపణలు రావడం క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందికరంగా మారుతోంది.
దిష్టిబొమ్మల దహనంతో అదనపు భారం...
రాజకీయ నిరసనల్లో భాగంగా అధికార, ప్రతిపక్ష వర్గాలు పోటాపోటీగా దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కూడా పోలీసులకు కొత్త సవాళ్లు తెస్తోంది. ఒక వర్గం కార్యక్రమం నిర్వహించిన వెంట నే మరో వర్గం దిష్టిబొమ్మ దహనం చేపట్టడం, నినాదాలు చేయడం, రహదా రులపైకి కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు అను మతులు ఉన్నాయా? ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందా? అగ్ని ప్రమాదానికి అవకాశం ఉందా? రెండు వర్గాలు ఎదురెదురుగా చేరి ఘర్షణకు దారితీసే పరిస్థితి ఉందా? అనే అంశాలను పోలీసులు ముందుగానే అంచనా వేయాల్సి ఉంటుంది. బందోబస్తు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ను మళ్లించడం, నిరసనకారులను అదుపులో ఉంచడం, పరిస్థితి చేయిదాటకుండా చర్యలు తీసుకోవడం పోలీసులకు అదనపు భారంగా మారుతోంది.
చట్టమే ప్రమాణంగా..
రాజకీయ వివాదాల్లో పోలీసులు తీసుకునే ప్రతి నిర్ణయం చర్చకు వస్తోంది. కేసు నమోదు చేసినా ప్రశ్నలు.. చర్యలు తీసుకోకపోయినా ప్రశ్నలే. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరమైన నిబంధనల ప్రకారం ముందుకు సాగడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం, శాంతిభద్రతలను కాపాడటం, రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వంటి బాధ్యతలను పోలీసులు నిర్వర్తిస్తున్నారు.
ఉప్పల్ నియోజకవర్గ ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులపై పని భారం కూడా పెరుగుతోంది. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్లెక్సీలుబ్యానర్ల వివాదాలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు, ఫిర్యాదులు, కేసులు.. ఇలా అనేక అంశాలను ఒకేసారి నిర్వహించాల్సి వస్తోంది.
అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా..
అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా.. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించా లన్నదే ప్రజల ఆకాంక్ష. రాజకీయ నాయకులు తమ పోరాటాన్ని రాజకీయ వేదికపైనే కొనసాగిస్తూ, పోలీసులకు చట్టాన్ని అమలు చేసే స్వేచ్ఛ ఇస్తేనే ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుంది. అధికారమా.. ప్రతిపక్షమా అన్నది కాదు.. చట్టమే ప్రమాణంగా ముందుకు సాగితేనే వివాదాలకు తెరపడుతుంది. రాజకీయ రగడ మధ్య నలిగే ఖాకీకి కావాల్సింది ఒత్తిడి కాదు.. సహకారం. పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.