3 April, 2026 | 4:40 AM

నేడు బస్తర్‌కు అమిత్ షా

09-02-2026 01:10 AM

మావోయిస్టుల లొంగుబాటు అంశంపై చర్చ!

చర్ల, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ జిల్లాలో సోమవారం జరిగే పాండుంకు కేంద్ర హోంమం త్రి అమిత్ షా హాజరుకానున్నారు. పాండుం అనేది బస్తర్ అభివృద్ధిని జరుపుకునే వేడుక. అనంతరం అన్ని రాష్ట్రాల డీజీపీ, ఐపీఎస్‌లతో సమావేశం జరగనుంది. మార్చి 31కి ముందు షా, సీఎం విష్ణుదేవ్‌సాయి, అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఏసీఎస్ హోమ్‌లతో జరిగే చివరి సమావేశం కావచ్చునని తెలుస్తున్నది. ఈ స మావేశంలో మావోయిస్టుల లొంగుబాటు గడువు దగ్గరపడనుండటంతో వ్యూహాలను చర్చించనున్నట్లు సమాచారం.