1 August, 2026 | 3:11 PM

మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూములు

01-08-2026 02:03 PM

బోథ్, ఆగస్ట్ 1(విజయక్రాంతి): మండలంలోని కౌట బి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మందుబాబులకు అడ్డాగా మారాయి. సాయంత్రమైందంటే మందుబాబులు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మకాం వేసి మద్యం సేవిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని లాపోతున్నారు. రాత్రిపూట మద్యం సేవిస్తున్న వారు స్థానికుల లేక బయట నుండి వచ్చిన వార అనేది తెలియకుండా పోతుందని పలువురు పేర్కొంటున్నారు.