1 August, 2026 | 3:13 PM

Vijaya Kranthi Effect: రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

01-08-2026 02:09 PM

విజయ క్రాంతి ఎఫెక్ట్...

వీల్ చైర్ ఘటనపై సిరియస్...

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్...

బాన్సువాడ, ఆగస్టు 1 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాలు ఫ్రాక్చర్ అయిన రమేష్ అనే రోగికి వీల్ చైర్ ఇవ్వడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని శుక్రవారం విజయ క్రాంతి ఎడిషన్ లో ప్రచురితమైన వార్తకు ఆసుపత్రి సూపరిండెంట్ ఎం.శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బందిపై ఆస్పత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల నిర్లక్ష్యం వాయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోగులపట్ల మెరుగైన వైద్య సేవలు అందించాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.