17 May, 2026 | 2:30 PM

25న సిద్దిపేట సభకు అమిత్ షా రాక

23-04-2024 12:23 AM

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి కనపడుతుండటంతో ఆ పార్టీ ప్రముఖులు రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఈ నెల 25న సిద్దిపేటలో బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా వస్తున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభకు అమిత్ షాతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ అభయ్ పటేల్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరు కానున్నారు.