ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి తదితరులు విడుదల చేశారు. జేఎన్టీయుహెచ్(JNTUH) వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలను మే 4, 5 తేదీన నిర్వహించింది. కాగా ఇంజనీరింగ్ పరీక్షలు మే 9 నుండి 11 వరకు జరిగాయి.
ఈ పరీక్షలు పలు షిఫ్టులలో నిర్వహించబడినందున, తుది స్కోర్లను రూపొందించడానికి విశ్వవిద్యాలయం ఒక సాధారణీకరణ ప్రక్రియను (normalisation process) అవలంబించింది. ఎప్ సెట్ పూర్తయిన ఆరో రోజే ఫలితాలను విడుదల చేసింది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో 1,97,241 మంది విద్యార్థులు, అగ్రీకల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ లో 84,954 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
ఎప్ సెట్ లో ర్యాంక్ సాధించిన వారు
- ఎం.రుషి(ఉప్పల్) ఫస్ట్ ర్యాంక్,
- అన్షుల్ (మూసాపేట్) రెండో ర్యాంక్,
- ఎం.వంశీధర్ రెడ్డి (పులివెందుల) మూడో ర్యాంక్,
- జే.రోషన్ మణిదీప్ (గుంటూరు) నాలుగో ర్యాంక్,
- ఎ.సాయి నిఖిత్ (మహబూబ్ నగర్)దో ర్యాంక్,
- ఎం.ఆస్నా (మేడ్చల్) ఆరో ర్యాంక్,
- వీ. శరద్ మహీశ్వరి (హైదరాబాద్) ఏడో ర్యాంక్,
- టీ.శ్రేయాస్ రెడ్డి (హైదరాబాద్) ఎనిమిదో ర్యాంక్,
- బీ.సమీరాజ్ రెడ్డి (హైదరాబాద్) తొమ్మిదో ర్యాంక్,
- ఆర్ జయంత్ శేఖర్ (మేడ్చల్) పదో ర్యాంక్.
TS EAMCET 2026 ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ అయిన eapcet.tgche.ac.in లో విడుదల చేయబడ్డాయి. తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు, తమ లాగిన్ వివరాలను ఉపయోగించి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) తరపున పరీక్షను నిర్వహించే జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (JNTUH), ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన TS EAMCET 2026 స్కోర్‌కార్డులను, తుది జవాబు కీలతో (Final Answer Keys) కలిపి విడుదల చేసింది.






