calender_icon.png 13 June, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగలా అమ్మ మాట అంగన్వాడి బాట

11-06-2025 07:23:01 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం పండగలా నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని వివిధ గ్రామాల్లో ర్యాలీలో నిర్వహించిన అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ చోట్ల బాలింతలు, గర్భిణీలు, చంటి పిల్లలకు ఎగ్ బిర్యానీ వండి పెట్టారు.