17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గైర్హాజరుతో ఉద్యోగాలు కోల్పోవద్దు..

11-06-2025 07:19 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు గైర్హాజరు పేరిట ఉద్యోగాలు కోల్పోకుండా విధులకు సక్రమంగా హాజరు కావాలని కేకే-5 గనీ మేనేజర్ శంభు నాథ్ పాండే(Manager Shambhu Nath Pandey) కోరారు. బుధవారం కేకే-5 గనిపై గైర్హాజర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ సంస్థలో లేని విధంగా సింగరేణిలో మంచి వేతనాలు ఉన్నాయని తెలిపారు. కార్మికులకు విధుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

అంతే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇతరులకు చెప్పడం ద్వారా పరిష్కారానికి మార్గం దొరుకుతుందని సూచించారు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుండి గైర్హాజర్ కు సంబంధించి సర్కులర్ వచ్చిందని, దీని ప్రకారం భూగర్భ కార్మికులు ప్రతినెల 16 మస్టర్లు, ఊపరితల కార్మికులు 20 మస్టర్లు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గైర్హాజర్ కార్మికులకు ప్రతినెల కౌన్సిలింగ్ ఉంటుందని, తరచూ విధులకు గైర్హాజర్ అయితే మస్టర్లు లేక డిస్మిస్ అయ్యే అవకాశాలు అధికంగా ఉండి డిస్మిస్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని దీనిని అర్థం చేసుకోవాలని కోరారు.

అనారోగ్యంతో పాటు ప్రమాదాల బారిన పడి గాయాలు మానిన ఒళ్ళు నొప్పులు ఉన్నటువంటి కార్మికులు వారి పరిస్థితిని తనతో పాటు పై అధికారుల దృష్టికి తీసుకువెళితే కొద్ది రోజులు సర్ఫేస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. పని లేకుండా విధులకు గైర్హాజర్ అవుతూ అటు వారి కుటుంబాలకు ఇటు సంస్థకు భారం కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంటిలేషన్ అధికారి శంకర్, సంక్షేమ అధికారిని ఆకుల రవళి, ఆఫీస్ సూపర్డెంట్ బుచ్చయ్యలు పాల్గొన్నారు.