05-02-2026 12:00:00 AM
మేళ్లచెరువు, ఫిబ్రవరి 4 : ఈనెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు మేళ్లచెర్వు లోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే మహాశివరాత్రి జాతరకు కోటి రూపాయలు మంజూరయ్యాయి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ,. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి చొరవ తో నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు కోటి రూపాయల మంజూరు ఉత్తర్వు కాపీని వివిధ పత్రిక ప్రతినిధులకు చరవాణి ద్వారా పంపారు.
ఈ కోటి రూపాయల నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి విడుదలయ్యాయి. ఉత్తర గోపుర నిర్మాణ పనులు, జాతర నిర్వహణకు వివిధ రకాల ఏర్పాట్లు, జాతరకు వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం తదితర కార్యక్రమాలు చేపనున్నట్లు తెలిసింది. నిధులు మంజూరి కావటం పట్ల గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉత్సవ కమిటీ, తదితరులు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.