calender_icon.png 9 February, 2026 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి ఆదర్శం?

09-02-2026 12:00:00 AM

  1. కలెక్టర్ స్పందిస్తారా..

పట్టు తప్పిన వాటర్ ట్యాంక్ 

భగీరథ పేరుతో రంగులు

ప్రమాదానికి ముందు చూపు

శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ 

ఇనుప చెవ్వలు తేలి కూలేందుకు సిద్ధ అయింది 

రంగులు వేసి బిల్లులు స్వాహా 

ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా...?

గోపాలపేట, ఫిబ్రవరి8: ప్రభుత్వాలు పాలకులు మారుతూ వస్తున్నారే తప్ప మండల కేంద్రంలోని నడిబొడ్డున ఉన్న ఈ వాటర్ ట్యాంక్ దుస్థితి మాత్రం మారడం లేదు ఈ వాటర్ ట్యాంక్ అవినీతికి ఆదర్శంగా నిలుస్తుంది. దీనివల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అంటూ చుట్టుపక్కల కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు . వీరి ఆవేదన వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో ఉంది.

ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి సుమారుగా 6 పర్యాయాలు అవుతుంది అంటే 30 ఏళ్ల అన్నమాట కానీ అప్పట్లో పలు ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు కానీ అప్పటి నిర్మాణంలో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తిగా అవినీతికి చేరుకుంది. అంతేకాకుం డా ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్టర్లకు చేతివాటం కలపడంతో ఈ వాటర్ ట్యాంక్ దుస్థితి ఇలా తయారయ్యిందని ప్రజ లు చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా గత తెలంగాణ టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్య మంత్రి కెసిఆర్ మంచి సంకల్పంతో మహిళలు నీటి కోసం బిందెలు పట్టుకొని బయటకు రావద్దన్న ఆకాంక్షతో ఇంటింటికి నల్ల ఏర్పాటు చేయాలని గొప్ప సంకల్పంతో విజయవంతం చేశాడు. అన్ని జిల్లాలలో నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు.

భగీరథ వాటర్ ట్యాంక్ ... 

కొన్ని గ్రామాలలో ఉన్న వాటర్ ట్యాంకులకే రంగులు వేసి కొత్తగా నిర్మించామని కొంతమంది కాంట్రాక్టర్లు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చేతులు కలిపి భగీరథ అనే పేరు పెట్టి రంగులు వేశారండి అం దులో ఇది ఒకటి. ఇలా వనపర్తి జిల్లాలో ఎ న్నో ఉన్నట్టు విమర్శలు వస్తూనే ఉంటాయి..

 30 ఏళ్ల వాటర్ ట్యాంక్ ....

గోపాలపేట మండల కేంద్రం ఈదమ్మ గడ్డ కాలనీలో వాటర్ ట్యాంకర్ నిర్మాణం చే పట్టి సుమారుగా 30 ఏళ్లు కావస్తుంది . ఈ ట్యాంకుకు పూర్తిగా శిథిలావస్థకు చేరుతుంది ఎప్పుడు కూలి క్రింద పడుతుందో అని పక్క న ఉన్న కాలనీ ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. బయటకు రావాలంటే ఈ ట్యాంక్ కింది నుండే వెళ్లాల్సి వస్తుంది. పిల్ల ర్లు కూలీ మూడు పిల్లర్ల పైన ఈ ట్యాంకు నిలబడి ఉంది పూర్తిగా దెబ్బ తిన్నాయి.

గత ప్రభుత్వాలు గత ప్రభుత్వ హయాంలో ఈ ట్యాంక్ నిర్మాణంపై ఎన్నో కథనాలు వచ్చా యి. తూతూ మంత్రంగా అధికారులు.. సం బంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తూతూ మాత్రం గానే స్పందించి వెళ్లారే తప్ప దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు లేదని ప్రజలు వాపోతున్నారు.

ఈ ట్యాంక్ నిర్మాణం పై అవినీతి 

గోపాలపేట మండల కేంద్రంలో కాలనీలకు తాగునీరు అందించాలన్న సంకల్పంతో మలనాటి ప్రభుత్వం వాటర్ ట్యాంక్ నిర్మా ణం చేపట్టి గ్రామంలోని ప్రజలకు నిరంధించింది. కానీ ఇక్కడే మతలపు దాగి ఉంది ఈ ట్యాంక్ నిర్మాణం చేపట్టే క్రమంలో అప్పటి కాంట్రాక్టర్లు ట్యాంక్ నిర్మాణం పనుల్లో నా ణ్యవంతంగా చేపట్టకుండా అధికారులతో చేయి కలిపి ఈ ట్యాంక్ నిర్మాణానికి వచ్చిన సిమెంటు సీకులు సైతం అమ్ముకున్నట్లు పలువురు వాపోతున్నారు.

కాంట్రాక్టు తీసుకున్నడమే కాకుండా ఇలా ప్రజలకు ఉప యోగపడే పనులపై కక్కుర్తి పడి సీకో సి మెంట్ అమ్ముకుంటే పనులు ఎంతవరకు న్యాయం జరుగుతుందో  చేసుకోవచ్చు.

నేడు ఇక్కడే ఈదమ్మ జాతర ....

గోపాలపేట మండల కేంద్రంలో ప్రతి ఏ టా ఇక్కడే ఈదమ్మ జాతర ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. శిథిలావస్థకు చేరుకు న్న ఈ వాటర్ ట్యాంక్ ముందు భాగమే ఈ దమ్మ గుడి కాబట్టి వేల మంది ప్రజలు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. విక్రయదారులు కూడా తినుబండా రాలు గాజులు మహిళలకు కావలసిన వస్తువులు ఆట వస్తువులు అన్నీ ఈ ట్యాంక్ కిందే పెట్టుకుని విక్రయాలు చేస్తుంటారు.

ఈ జాతరలో వేలమంది మహిళలు ప్రజలు భక్తులు బోనాలతో ఊరేగింపు కాయ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ ట్యాంకు శిథిలావస్థకు చేరడం పట్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందో నంటు ప్రజలు భయాందోళనలు గురవుతున్నారు.

ఆర్ డబ్ల్యూఎస్ ఎక్కడ....? 

గత ప్రభుత్వంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్పుడప్పుడు వచ్చి ఈ వాటర్ ట్యాంకుల పరిస్థితి ఎలా ఉందని పరిశీలించేవారు. కానీ అప్పటి అధికారులు మారాక రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఏనాడు వీటి పరిస్థితి పట్టించుకున్న దాఖలాలు లేవంటూ అక్కడున్న కాలనీవాసులు వాపోతున్నారు ఇంత ప్రమాదంగా ఉన్న దీనిని ఎవరు కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆ కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.

వాటర్ ట్యాంకులను పరిశీలిస్తున్నాం... సర్పంచ్ కర్రోళ్ల స్వప్న భాస్కర్ .. 

సర్పంచ్ల కాలం ముగిశాక రెండేళ్లు అధికారులే గ్రామాల పర్యవేక్షణ చూశారు. కానీ వారి పర్యవేక్షణలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా కాలనీలన్నీ కంపు కొట్టుకొని పోతున్నాయి. అదేవిధంగా వాటర్ ట్యాంకులను కూడా పరిశీలిస్తున్నాo. ఈ గ్రా మంలో ఒక్కొక్కటిగా పరిశీలించి మళ్లీ గ్రామాన్ని అభివృద్ధి లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం.

ఈ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న ఈదమ్మ జాతర కూడా పెద్దగా జరిపించాలని సుమారుగా వందల ట్రిప్పుల మట్టిని తరలించి శుభ్రపరిచాము. ఈ వాటర్ ట్యాంక్ ను కూడా పరిశీలించాము అధికారులతో ప్రభుత్వంతో చర్చించి ఈ ట్యాంక్ ప్లేస్ లో మరో ట్యాంకు నిర్మించడానికి నిధులు మంజూరు చేయించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.

 ఒక్క అధికారి కూడా రావడం లేదు.. మేస్త్రి బాబు గోపాలపేట 

అప్పట్లో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టిన క్రమంలో అవినీతిలో మునిగినట్లు తెలుస్తుంది ఈ వాటర్ ట్యాంకు వేల మంది దాహార్తిని తీరుస్తుంది ఇలాంటి వాటర్ ట్యాంకు నిర్మాణం సిమెంటు సీకు నాన్నవంతంగా చేపట్టకపోవడం పట్ల కొన్నేళ్లలోనే శిథి లావస్థకు చేరి దెబ్బతింది ఈ విషయాన్ని ఎ న్నో మార్లు పత్రికలో పలు కథనాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికా రులు మాత్రం నిమ్మకు నీరెక్కినట్లే ఉన్నారే తప్ప ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.

కలెక్టర్ సర్ మీరైనా దృష్టి. పెడతారా.. అనురాగ్ గోపాలపేట 

 మా గృహాలు శిలావస్థకు చేరిన ఈ ట్యాంక్ పక్కనే కొలువై ఉన్నాయి నిత్యం ఈ ట్యాంక్ నిర్మాణం కింది నుంచి మేము బయటకు వెళ్లాలి ఈ ట్యాంకు శిథిలావస్థకు చేరి ఎంతో ప్రమాదకరంగా తయారయింది. మ రి ఈ ట్యాంక్ కూలి చుట్టుపక్కల ఉన్న గృహా ల ప్రజలు ప్రమాదానికి గురికాకముందే జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం.