09-02-2026 12:45:41 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కబ్జాల్లో కాంగ్రెస్, --బీఆర్‌ఎస్ నంబర్ వన్ అని, రాష్ట్ర రాజకీయా ల్లో దశాబ్దాలుగా అగ్రవర్ణాల పాలనలో బీసీలకు అన్యా యం జరిగిందని, వారిని రాజకీయ సమాధి చేసేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే అని టీఆర్పీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లన్న పాల్గొన్నారు.
ఈ సభకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరై ఉత్సాహంగా మద్దతు తెలిపారు. అంతకుముందు బీసీ తొలి అమరుడు సాయి ఈశ్వర చారి చిత్రపటానికి పూల మా ల వేసి నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా టీఆర్పీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగురవేశారు. సభలో మల్లన్న ప్రసంగిస్తూ.. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా రెడ్డి, వెలమ వర్గాలు అధికారం అనుభవిం చాయి కానీ బీసీలకు, పేదలకు మాత్రం న్యాయం జరగలేదన్నారు.
‘టీఆర్పీ అభ్యర్థులు అందరూ చదువుకున్న వారు, ప్రజల మధ్య నుంచి వచ్చినవారు. కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల అర్హతలు ఏమిటో తెలుసా? 4 ప్లాట్లు కబ్జా, 5 ప్లాట్లు కబ్జా, 6 ప్లాట్లు కబ్జా... ఇదే వాళ్ల రాజకీయ అర్హత’ అంటూ విమర్శించారు. కాంగ్రెస్, బీజే పీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి బీసీలకు న్యాయం రావాలంటే పురుగుల మందు డబ్బా పట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను అవమానించడమే ఈ పార్టీల రాజకీయం అని మండిపడ్డారు.
‘సూ ర్యాపేటలో రెడ్ల రాజకీయ ఆధిపత్యానికి ఇది చివరి దశ అని సూర్యాపేట రెడ్లను రాజకీయ సమాధి చేస్తా. అలా చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని సవాల్ విసిరారు. తీన్మార్ మల్లన్నకు ఎక్స్‌అఫిషియా ఓటు ఇక్క డే ఉంది. ఇక చూసుకుందాం’ అంటూ హెచ్చరించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులపై విమర్శలు గుప్పిస్తూ.. ‘ఒకడు జాతిపిత అంటడు, ఇంకోడు లాగుల తొండలు ఇడుస్తా అంటడు. ఇందుకోసమేనా మీకు అధికారం ఇచ్చింది’ అని ఆగ్రహించారు.
‘ఇక నుండి మా ఓట్లు మేం వేసుకుంటాం, ప్రజల ఓట్లతో అధికారం అనుభవించి మళ్లీ ప్రజలనే మోసం చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగదీష్‌రెడ్డి రాజకీయ తోకలు కట్ చేసేది కత్తెర గుర్తే అని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా గాయి గాయి అవుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూ.. ‘తులం బంగారం ఇచ్చారా? నెలకు 2500 ఇచ్చారా? హామీలు ఏవిరా అంటే తొండలు పడుతా అంటున్నారు అని రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఇక సాగవు అని అన్నారు. “రెడ్లంతా కలిసి మంచాల పైసలు దొంగతనం చేసి 100 కోట్లు కొట్టేయాలని చూశారని మండిపడ్డారు. దమ్ముంటే జానయ్య యాదవ్ కబ్జాలు బయటపెట్టండి” అంటూ సవాల్ విసిరారు.
కేసీఆర్‌తో ఒప్పందం చేసుకుని ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇతర కేసుల నుండి తప్పివడం కోసం రెండు వేలు తీసుకున్నావా లేదా రేవంత్?” అంటూ ప్రశ్నించారు. “ఈ మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి టీఆర్పీ అభ్యర్థులను గెలిపించండి. బీసీలకు, పేదలకు నిజమైన న్యాయం చేయగలిగేది టీఆర్పీ ఒక్కటే” అని తీన్మార్ మల్లన్న కోరారు.
నల్లగొండలో మల్లన్న ప్రచారం
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం నల్లగొండ మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు. 35వ డివి జన్‌లో పార్టీ అభ్యర్థి శిలువేరు భాగ్యతో కలిసి గడప గడప ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. స్థానికంగా ఉన్న తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కా రం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
అభ్యర్థి శీలువేరు భాగ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అభివృద్ధి, పారదర్శక పరిపాలన తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమవుతుందని, టీఆర్పీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తారని పేర్కొన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిం చాలని ప్రజలను కోరారు. 39వ డివిజన్‌లో టీఆర్పీ అభ్యర్థి కోమునపల్లి పృద్వి రాజ్‌కు మద్దతుగా మల్లన్న ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో కత్తె ర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.