సీడీపీఓ అక్రమాలపై విచారణ జరపాలి
28-04-2026 01:04 AM
బైంసా, ఏప్రిల్ 27 (విజ యక్రాంతి): ముథోల్ నియోజకవర్గం పనిచేస్తున్న సీడీపీఓపై విచా రణ జరపాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి నాయకులు జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీడీపీఓ ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుందని సెలవుల డబ్బులను తమ ఖాతాలో వెయ్యాలని డిమాండ్ చేస్తుందని వారు ఆరోపించారు. వేధింపులకు గురి చేస్తుందని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు.






