శభాష్ అర్చన
28-04-2026 01:04 AM
ఇంటర్ టాపర్‌కు ఎంపీ రవిచంద్ర అభినందనలు
వరంగల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన అర్చనను బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆశీర్వదించారు. ఎంపీ రవిచంద్ర వ్యక్తిగత సహాయకులు వీణవంక కిరణ్ కుమార్ కుమార్తె అయిన అర్చన హన్మకొండలోని రెసోనన్స్ జూనియర్ కాలేజిలో ఏంపీసీ చదివి ఇటీవల వెల్లడించిన ఫలితాలలో మొత్తం 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.
ఈ సందర్భంగా అర్చన తన తండ్రి కిరణ్ తో పాటు ఎంపీ రవిచంద్ర, ఆయన పెద్దన్న కిషన్ లను కలిశారు. వారిద్దరు ఆమెకు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాదించాలని ఆశీర్వదించారు.






