12-10-2025 06:30:23 PM
సింగం ప్రసాద్..
కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం ప్రసాద్ కోనరావుపేట ప్రీమియర్ లీగ్(కేపీల్) క్రీడాకారుల కోసం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసారు. గత శుక్రవారం ముగిసిన కేపీల్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేత జట్టుకు రూ.20 వేలు, రన్నర్ అప్ జట్టుకు రూ.10 వేల నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను మరింత ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కోనరావుపేట మండలంలోని ప్రతిభావంతులైన యువతను గుర్తించాలనే సంకల్పంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రతి యువకుడికి దేవుడు ప్రత్యేక ప్రతిభను ఇస్తాడని కొందరికి క్రికెట్‌లో, మరికొందరికి వాలీబాల్, కోకో, కబడ్డీ వంటి క్రీడల్లో నైపుణ్యం ఉంటుంది. అటువంటి ప్రతిభావంతులను నేను ఎల్లప్పుడూ ప్రోత్సహించడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరు తమతమ ప్రతిభను చూపించి కోనరావుపేట మండలానికి మంచి పేరు తీసుకురావాలని యువత చెడు దారినా పడకుండా మత్తుకు డ్రగ్స్ కు బానిసలు కాకుండా సరైన మార్గంలో నడిచి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాల యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.