12-10-2025 06:34:24 PM
ప్రముఖ కవి, బహుభాష వేత్త నల్లిమెల భాస్కర్..
కామారెడ్డి (విజయక్రాంతి): కవి గఫూర్ శిక్షక్ రచించిన రచనలు ప్రజల సమస్యలు పరిష్కార దిశలో సాగుతున్నాయని ప్రముఖ కవి, బహు భాష సాహితీవేత్త నలిమేల భాస్కర్ అన్నారు. ఆదివారం నలిమిళ్ళ భాస్కర్ ను కలిసి తన పుస్తకాలను ధైర్య కవచం, యుద్ధ గీతం, దీర్ఘ కవిత పుస్తకాలను గఫూర్ శిక్షక్ అందజేశారు. ఈ సందర్భంగా గపూర్ శిక్షక్ ను సుప్రసిద్ధ రచయిత, అనువాదకులు నలిమేల భాస్కర్ అభినందించారు. యుద్ధ గీతం దీర్ఘ కవిత చాలా ఆలోచింప జేసేదిగా ఉన్నదని నలిమెల భాస్కర్ అన్నారు.