31 May, 2026 | 10:41 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు నియామకం

26-02-2026 03:15 PM

ప్రజా సమస్యలు తీరుస్తూ..ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగట్టండి..మాజీ ఎమ్మెల్యే. 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీప నర్సింలను నియమిస్తూ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. గురువారం రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వ్యవహారాల్లో అవగాహన ఉన్న తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ దీప నర్సింలు నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ..నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కౌన్సిల్లో కౌన్సిలర్లు అంతా ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, రాజు గౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి  నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్,  సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరాబాను , అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత , రూప తదితరులు పాల్గొన్నారు.