నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళన
26-02-2026 03:45 PM
హైదరాబాద్: తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఈ-నామ్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోలేక పోవడంతో నిజామాబాద్‌లో(Nizamabad market yard) పలువురు పసుపు రైతులు(Turmeric farmers) నిరసన చేపట్టారు. గత రెండు రోజులుగా రైతులు స్లాట్ బుక్ చేసుకోవడానికి పోర్టల్‌లోకి ప్రవేశించలేకపోయారు. దీనితో వారు నిరసన తెలిపారు. స్లాట్ బుక్ చేసుకోవడానికి అధికారులు చూపిన ఉదాసీన వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేస్తూ, రైతులు మార్కెట్ యార్డ్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. మూడు రోజులుగా పసుపు విక్రయాల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సాంకేతిక లోపాన్ని సరిచేస్తామని హామీ ఇచ్చి రైతులను శాంతింపజేశారు.




