14 August, 2026 | 3:52 PM

Breaking News

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ, రోడ్డు సౌకర్యం కల్పించాలి   •   సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి   •   హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో సత్యాగ్రహ దీక్ష   •   గీత దాటితే సీఎంతో సహా అందరూ ఒకటే: రాజగోపాల్‌పై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం   •   రామాలయంలో ప్రారంభమైన లలిత సహస్రనామాల పారాయణం.   •   నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాపాడాలి: చాడ వెంకటరెడ్డి   •   ఈనెల 16న జయశంకర్ జిల్లా క్రికెట్ క్రీడాకారుల సమావేశం   •   సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే   •   జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్ కీలక ప్రకటన   •   వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి జిల్లా పోలీసులు   •  

భారతదేశ నారీ శక్తికి జరిగిన క్షమించరాని ద్రోహం

18-04-2026 07:43 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ శనివారం రోజున మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్, దాని ఇండికూటమి తమ మహిళా వ్యతిరేక ఆలోచనా ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నారు. ముప్పై ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారు. ఆ తర్వాత దీన్నిపరిహాసం చేశారు. ఈరోజు ఏకంగా దీన్ని నిలిపివేశారు. 

ఇది రాజకీయం కాదు, మహిళలు సాధికారత సాధిస్తారనే భయం మహిళలు అధికార పీఠాలను అధిరోహిస్తుంటే రాహుల్ గాంధీకి, ఆయన మిత్రపక్షాలకు ఎందుకు అంత భయం, మహిళలను కేవలం ఓటు బ్యాంకులుగా చూడటమే తప్ప, వారిని చట్టసభల ప్రతినిధులుగా చూడటం కాంగ్రెస్‌కి ఇష్టం లేదా, మన తల్లులు, అక్క-చెల్లెళ్లు, ఆడబిడ్డలు, కూతుర్లకు, సాధికారత కల్పించే ఒక బిల్లు వీగిపోతుంటే, సంబరాలు చేసుకోవడం కంటే సిగ్గుచేటు మరొకటి లేదుని, పార్లమెంటు లోపల వారు కొట్టిన చప్పట్లు భారతదేశంలోని ప్రతి మహిళను అవమానించడమే. మహిళలకు అధికారం ఉండకూడదని, వారికి ప్రాతినిధ్యం దక్కకూడదని కాంగ్రెస్ బలంగా కోరుకుంటుంది. మహిళాసాధికారత కాదు వారిని నియంత్రించడమే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు.