ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదే
మరో విశేషం పంచుకున్న ఆనంద్ మహీంద్రా
బెంగళూరు, మే 21: నిత్యం ఏదో ఒక స్ఫూర్తిమంతమైన అంశంతో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మరో అంశాన్ని తన ఫాలోవర్స్‌తో పంచుకొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యుత్తమ ఫొటో ఇదేనంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో ఓటుహక్కు వినియోగించుకొన్న ఓ వ్యక్తి ఎన్నికల అధికారులు అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో స్పాట్ వద్ద తన వేలికి ఉన్న ఇంకును చూపిస్తున్నాడు. అతడి ఒంటిమీద చొక్కా కూడా లేదు. విశేషం ఏమిటంటే అతడు గ్రేట్ నికోబార్ దీవుల్లోని అంతరించి పోతున్న షోంపెన్ తెగకు చెందిన వ్యక్తి. ఈ తెగలో ఏడుగురు వ్యక్తులు మాత్రమే మిగిలారు. ఆయన తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన ఆనంద్‌మహీంద్రా.. ‘ప్రజాస్వామ్యం ఎదురు లేనిది. ఎవరూ ఆపలేని శక్తి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.






