3 August, 2026 | 12:01 PM

తొలి కిరీటానికి 30 ఏళ్లు

22-05-2024 02:19 AM

మధుర క్షణాలను గుర్తు చేసుకున్న విశ్వసుందరి

ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సుస్మితా సేన్

న్యూఢిల్లీ, మే 21: 1994 మే 21న భారత్ తరఫున తొలిసారి విశ్వసుందరి కిరీటాన్ని సుస్మితా సేన్ దక్కించుకుని చరిత్రకెక్కారు. ఈ అద్భుత ఘట్టానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను మాజీ విశ్వ సుందరి నెమరువేసుకున్నారు. ఇది తనకు ప్రత్యేకమైన రోజని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ ఫొటోను ఆమె చేస్తూ అప్పటి విషయాలను పంచుకున్నారు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. నేను అనాథాశ్రమంలో ఈ చిన్నారిని కలిశాను. ఆ క్షణంలో జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. అత్యంత అమాయకమైన ఆ బాలిక చూపు నన్ను కట్టి పడేసింది. అలాంటి వారికి సేవ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఇప్పుడు అదే బాటలో ముందుకు నడుస్తున్నా. ఏటా ఈ రోజును గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటా. ఇది నా జీవితంలో చెరిగిపోని ఓ పేజీ. ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కనిపిస్తున్నాయి. నాకు గొప్ప గుర్తింపు, శక్తిని భారత్ ఇచ్చింది. అందుకు కృతజ్ఞతలు. ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్నారు. అంతులేని ప్రేమను అందిస్తున్నారు అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.