విమానం ఢీకొని ఫ్లెమింగోలు మృతి
22-05-2024 02:27 AM
ముంబై, మే 21: ముంబైలో విమానం ఢీకొనటంలో అత్యంత అరుదైన దాదాపు 40 ఫ్లెమింగో కొంగలు మరణించాయి. పట్నానగర్లోని లక్ష్మినగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఎమిరేట్స్ విమానం ఈకే508 ఢీకొనటంతో ఫ్లెమింగోలు మరణించినట్టు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు తెలిపారు. ఫ్లెమింగోలు ఢీకొట్టినప్పటికీ విమానానికి ప్రమాదం ఏర్ప డలేదని, ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా దిగిందని అధికారులు చెప్పారు. అయితే, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మళ్లీ బయలుదేరేందుకు అనుమతించారు. ఈ ఘటనపై అటవీశాఖ దర్యాప్తు ప్రారంభించింది.






