18-07-2025 12:43:38 AM
*వన మహోత్సవంలో భాగంగా అనంతగిరిలో మొక్కలు నాటిన స్పీకర్
*బ్లాక్ గ్రౌండ్ లో నూతనంగా బ్యాట్మెంటల్ కోర్టు పనుల ప్రారంభం
వికారాబాద్, జూలై 17:పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అనంతగిరి గుట్ట ప్రాం తాన్ని తీర్చిదిద్దాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. గు రువారం వికారాబాద్ జిల్లాలో సభాపతి పర్యటనలో భాగంగా అనంతగిరిగుట్ట పైన అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు, పట్టణ కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ లో క్రీడా ప్రాంగణం పునః నిర్మాణం, బ్యాట్మెంటన్ కోర్టు ఏర్పాటు నిర్మాణ పనులకు శంకుస్థాపనలతో పాటు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి అటవీ ప్రాం తంలో మొక్కలు నాటే కార్యక్రమంలో సభాపతి గడ్డ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభాపతి అధికారులనుద్ధేశించి మాట్లాడుతూ... అనంతగిరి అటవీ ప్రాంతంలో పర్యా టకులకు మంచి అనుభూతి, సంతృప్తిని కలిగించే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సుదీర్ఘ కాలంగా అవసరానికి వచ్చే నిర్మాణాలతో పాటు సదుపాయాలను నాణ్యతతో పకడ్బందిగా పట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వన మహోత్సవంలో భాగంగా ఆకుపచ్చ తెలంగాణ దిశగా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
కోటి రూపాయల వ్యయం తో చేపట్టే వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ పు నఃనిర్మాణ, బ్యాట్మెంటన్ కోర్టు పనులను నాణ్యత లోపము లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా అనంతగిరి అటవీ ప్రాంతంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమా ల్లో అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లిం గ్యా నాయక్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఆర్డీవో వాసు చంద్రల,సంబంధిత శాఖల అధికారులుపాల్గొన్నారు.