పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా అందే గణేష్
కామారెడ్డి, జూలై 30,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా అందే గణేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మార్కండేయ మందిరంలో జరిగిన సంఘం మండల పద్మశాలి సమావేశంలో గణేష్ ను సంగం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. ఆయనతోపాటు సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా సిరిమల్లె రాజు, కోశాధికారిగా ఏల్దండ రవి లను ఎన్నుకున్నారు.
కాగా మండలంలో పద్మశాలీలు రాజకీయంగా ఎదగడానికి, పద్మశాలీలు ఐక్యంగా ఉండడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దోమకొండ సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధ రాములు,పద్మశాలి సంఘం దోమకొండ పట్టణ అధ్యక్షుడు మేక నాగరాజ్, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, క్యాషియర్ గణేష్, మండల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి సిరిమల్లె రాజు, కోశాధికారి ఎల్దొండ రవి, కొట్టాల గడ్డ పద్మశాలి సంఘం అధ్యక్షుడు జగదీష్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ కుమార్, ఐరేని రాజేందర్, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు సుంచు రాములు,బాలే సురేందర్, అందే నాగభూషణం, బీసు సంతోష్ కుమార్, అందే లింగం, దీకొండ శంకర్ పద్మశాలి సంఘం కుల పెద్దలు సంఘ సభ్యులు పాల్గొన్నారు.






