23 August, 2026 | 11:26 AM

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా

13-06-2024 11:37 AM

అమరావతి: తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని తెలిపారు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుంది. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు అని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అంతకు ముందు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. సీఎం, కుటుంబ సభ్యులు తిరుమలలో శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు.