23 August, 2026 | 10:34 AM

నీట్‌ కౌన్సిలింగ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

13-06-2024 11:53 AM

న్యూఢిల్లీ: నీట్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. నీట్ కౌన్సెలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సర్వోన్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను జులై 8కి వాయిదా వేసింది. 1,563 మందికి గ్రేస్ మార్కులు వచ్చినట్లు ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. విద్యార్థుల గ్రేస్ మార్కులను ఎన్టీఏ రద్దు చేసింది. గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్ కు వెళ్లొచ్చిన ఎన్టీఏ తెలిపింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఎన్టీఏ ప్రస్తావించింది. గ్రేస్ మార్కులు కావాలనుకుంటే మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుదని ఎన్టీఏ తెలిపింది. జూన్  23న తిరిగి పరీక్ష, 30న ఫలితాలు వెల్లడవుతాయని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష తర్వాత కౌన్సెలింగ్ ఉంటుందని ఎన్టీఏ సుప్రీం కోర్టుకు తెలిపింది.