28 June, 2026 | 9:14 PM

ఆంధ్ర ప్రదేశ్ అసోసియేషన్ ఫర్ ది డెఫ్ (APAD) 56వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్

28-06-2026 08:36 PM

ఆంధ్ర ప్రదేశ్ అసోసియేషన్ ఫర్ ది డెఫ్ (APAD) 56వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు 28 జూన్ 2026 ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు తాము నడుపుచున్న మోడల్ స్కూల్ ఫర్ ది డెఫ్, అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్ పెట్, హయత్ నగర్ నందు 150 మంది సభ్యులతో సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఇందులో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు హెలెన్ కిల్లర్ విద్యాలయం నుండి మద్దతు తెలుపుతూ ఆ కళాశాల ఉపాధ్యాయులు మరియు 70 మంది విద్యార్థులు ఈ సమావేశానికి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు లాయర్ దుర్గాప్రసాద్ గారు మరియు హెలెన్ కిల్లర్ విద్యాసంస్థలు స్థాపకులు ప్రొఫెసర్ పట్టాన్ ఉమర్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెంబర్స్ అయిన శ్రీ వెంకట్ రెడ్డి లక్ష్మణ్ గారు, నరసింహులు, శ్రీ స్వామి, శ్రీ వి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ బాల్రెడ్డి, జగన్మోహన్, మురుగన్, వాసుదేవ రెడ్డి, టీ పార్వతి, విజయ కుమారి, ఉమాదేవి మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి నాగ లత గారు పాల్గొన్నారు.

ఈ 56వ వార్షిక సంఘ సమావేశంలో నిర్ణయాలు ఏ.పీ.ఏ.డి. సభ్యులందరూ ఆమోదముద్ర వేశారు. తీర్మానం చేయబడిన అంశాలు:

1) ప్రతి సభ్యుడు తమ సభ్యత్వాన్ని రుసుము 500 చెల్లించి రెన్యువల్ చేసుకోవడం, అదే విధంగా 500 చెల్లించి నూతన సభ్యత్వాన్ని పొందటము జరిగింది. ఇందులో దాదాపు 72 మంది పూర్వ సభ్యులు మరియు దాదాపు 35 మంది నూతన సభ్యులు ఏ.పీ.ఏ.డి. సభ్యత్వాన్ని స్వీకరించారు.

2) ఏ.పీ.ఏ.డి. సంఘ సభ్యులు ప్రస్తుతం రెండు క్రిమినల్ మరియు నాలుగు సివిల్ కేసులను హైకోర్టు, డిస్టిక్ కోర్టు పరిధిలో న్యాయం కోసం పోరాడుతున్నారు. తమ సంఘానికి చెందిన 9.15 గుంటల భూమిని చట్ట విరుద్ధంగా సభ్యులు అనుమతి లేకుండా ఆరు మంది కొత్త సభ్యులతో చేతులు కలిపి శ్రీ ఎస్ జితేందర్ నాథ్ సెక్టర్ 2009 సంవత్సరంలో 6 మందికి అమ్మడం జరిగింది. ఆ భూమిని తిరిగి సంపాదించడం కొరకు అందరూ సభ్యులు ఏకతాటిపై పోరాటం చేయవలసిన ఆవశ్యకతను ఎంతో ఉందని తీర్మానం చేశారు.

3) జిల్లా ఉన్నత అధికారి కలెక్టర్ గారి ఫార్ములాట్ చేసిన Adhoc కమిటీ గురించి వాటిలోని సభ్యులు గురించి తెలియజేసి, అందరి సభ్యులు ఆమోదం ముద్ర పొందడం జరిగింది.

4) కరోనా తదుపరి నుండి మోడల్ స్కూల్ ఫర్ ది డే దాదాపు మూడు సంవత్సరాలు ఎవరు పట్టించుకోని సమయంలో ప్రొఫెసర్ పట్టాన్ ఉమర్ ఖాన్ గారు అడిగిన వెంటనే ముందుకు వచ్చి పాఠశాల నిర్వహణ ఖర్చులతో పాటు వినియోగానికి పనికిరాని మోడల్ స్కూల్ బిల్డింగులు మరమ్మతులు చేయించడంతోపాటు కిటికీలు, తలుపులు, మార్బుల్స్ (టైల్స్) మరియు పెయింటింగ్ చేయడం కొరకు గాను దాదాపుగా రూ. 14,00,000/- (లక్షలు) ఖర్చు చేయడం అహర్నిశలు బదురులా అభివృద్ధికి పాటుపడుతున్నారు అదే విధంగా హాస్టల్ బిల్డింగ్ కు కూడా తమ ఫైనాన్షియల్ సపోర్ట్ ను అందించి ఈ పాఠశాలకు పునర్వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

5) ఈ 56వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ లో అందరూ ఒప్పందం చేసి హైకోర్టు లాయర్ శ్రీ దుర్గా ప్రసాద్ మరియు శ్రీ నిరంజన్ ప్రసాద్ అపాయింట్మెంట్ ఆర్డర్ను క్రమబద్ధీకరించు ముఖ్యంగా శ్రీ దుర్గా ప్రసాద్ గారు సిజిఆర్ఎఫ్-2 (CGRF-2) లోని పాఠశాల పేరుతో ఉన్న విద్యుత్ కనెక్షన్ తిరిగి తీసుకునే విధంగా మద్దతు కూడగట్టి దుష్టులుతో వారి ఇల్లీగల్ యాక్టివిటీ కళ్లెం వెయ్యాలని అందరు సభ్యులు తీర్మానించడం జరిగింది.

పైన పేర్కొబడిన 5 రిజర్వేషన్స్ లను 107 మంది యూనానిమస్ గా అప్రూవల్ చేయడం దానికి తగిన డాక్యుమెంట్ ఈవిడేన్సులను సీజీఆర్ఎఫ్-2, చైర్ పర్సన్ కు వినయంగా అందజేయమని ముక్తకంఠంతో ఏ.పీ.ఏ.డి. Adhoc కమిటీ మెంబర్స్, ఏ.పీ.ఏ.డి. సంఘ సభ్యులు అందరూ కలిసి ఏకదాటితో క్రమబద్ధీకరణ పోరాడి ఆక్రమణకు గురి అయిన స్థలాన్ని తిరిగి పొందే విధంగా సభ్యులందరూ, విజయం దక్కేవరకు పోరాటం చేయాలని తెలియజేశారు.