3 July, 2026 | 6:02 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

అమెరికాలో ఆంధ్రా యువకుడి బలవన్మరణం

25-03-2025 11:59 PM

ఆరిజోనా: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడుకు చెందిన కొల్లి అభిషేక్ (34), అరవింద్ అనే అన్నాదమ్ములు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. వారిద్దరూ ఆరిజోనాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది అభిషేక్‌కు వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ ఆరిజోనాలోనే ఉంటున్నారు. వచ్చే జీతం సరిపోకపోవడంతో అభిషేక్ ఆరు నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.

ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య అక్కడి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆరిజోనాలోని ఓ ప్రాంతంలో అభిషేక్ మృతదేహాన్ని గుర్తించారు. అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అభిషేక్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.