3 July, 2026 | 5:39 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు

03-07-2026 05:03 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రచార ఆర్భాటాలే ఉన్నాయి తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం తప్ప అభివృద్ధి శూన్యం అని ఖానాపూర్ బీఆర్ ఎస్ నాయకులు దుయ్యబట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్,కౌన్సిలర్ ఇందిరా, గౌరీకర్ రాజులు మాట్లాడుతూ... ఇంతకాలం తర్వాత ఖానాపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులు తెచ్చాడని ఆ పార్టీ నాయకులు పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుచేటని ఖానాపూర్ లో వందల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు పూర్తి చేసిన ఒక్క అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపించే దమ్ము ఉందా ? అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలను పూర్తిగా విస్మరించి ప్రచార ఆర్భాటాలతో కాలం గడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే అభ్యంతరంగా నిలిచిపోయిన రేంకొనే వాగు బ్రిడ్జిలను  పనులను వెంటనే పూర్తి చేయాలని కోట్ల రూపాయలతో మంజూరైన రోడ్ల పనులు సంవత్సరాలుగా నిలిచిపోయాయని వాటిని వెంటనే పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు ఉన్నారు.