3 July, 2026 | 4:55 PM

Breaking News

కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •   హరీశ్ రావు ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేయలేని పిరికి వాళ్లం కాదు   •   మండల వ్యాప్తంగా కురిసిన వర్షం... రైతుల్లో ఆనందం   •  

37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

03-07-2026 04:23 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్ గాయత్రీ నగర్ లో మునిసిపల్ సాధారణ నిధుల నుండి 77 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ మరియు సిసి రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. అలాగే పద్మశాలి స్ట్రీట్ శ్రీనివాస థియేటర్ సమీపంలో సిఎస్ఆర్ నిధులతో ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 37 వ డివిజన్ కార్పొరేటర్ కె. ఏపిపి చంద్ర, బిజెపి కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,డివిజన్ ప్రజలు పాల్గొన్నారు