10 April, 2026 | 3:04 AM

చిన్నారిని చితకబాదిన అంగన్వాడీ టీచర్

11-02-2026 03:45 PM

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

వెంకటాపూర్ లో ఘటన

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో  కొంపెల్లి విజయ్ కొడుకు విధ్వంత్ అంగన్వాడి పాఠశాలలో ఓ టీచర్ చిన్నారిని చితక బాదడంతో కన్నుకు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కొడుకు ని అకారణంగా ఇష్టం వచ్చినట్లు కొట్టిన అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.